అలనాటి అందాల హీరోయిన్ లయ (laya Gorty)సినిమాలకు దూరమైనా..మూవీ లవర్స్ కు ఆ లోటు తీర్చేందుకు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూఎస్‌లో ఉంటున్న ఈ బ్యూటీ ఎప్పటికపుడు ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంటుంది. ఇప్పటికే లయ యూఎస్ వీధుల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సాంగ్‌తో నెటిజన్ల ముందుకొచ్చింది లయ.
ఈ సారి తాను నటించిన హనుమాన్ జంక్షన్ (Hanuman Junction)లోని పాటకు స్టెప్పులేసింది. హిట్ ట్రాక్ గోల్మాల్ సాంగ్ (laya Golmaal dance)కు తన పార్ట్నర్ సారికారెడ్డితో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసి నెటిజన్లను కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. నేను నటించిన హనుమాన్ జంక్షన్‌లోని గోల్మాల్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నా..అయితే ట్రై చేయండి..అంటూ డ్యాన్స్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది లయ. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Read Also : Ram Pothineni | రామ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడా..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!