Ram Pothineni | రామ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడా..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో వస్తోందీ ది వారియర్ (The Warriorr).. రామ్‌కు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి గా నటిస్తోంది. కాగా ప్రాజెక్టకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయమొకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) చేస్తున్న తాజా ప్రాజెక్టు ది వారియర్ (The Warriorr). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో వస్తోందీ చిత్రం. రామ్‌కు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి గా నటిస్తోంది. కాగా ప్రాజెక్టకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయమొకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే రామ్ ఇప్పటివరకు సినిమా బిజినెస్‌లోకి ప్రవేశించలేదు.
కానీ మొదటిసారి ఈ సినిమాతో డిస్ట్రిబ్యూషన్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. సినిమా అవుట్‌పుట్‌పై ఆత్మవిశ్వాసంతో ఉన్న రామ్ వైజాగ్ ఏరియా హక్కులను కొనుగోలు చేశాడన్న న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. తాజా టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులకు నిర్మాతలు రూ.18 కోట్లుగా నిర్ణయించగా..వైజాగ్‌కు సంబంధించిన హక్కులను రూ. 4.35 కోట్లకు దక్కించుకున్నట్టు టాక్ నడుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సాధారణంగా సినిమాలు మిగితా ప్రాంతాల్లో ఎలాంటి ఫలితాలు ఇచ్చినా..వైజాగ్ విషయానికొస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తుంటాయి. రామ్ వైజాగ్ హక్కులు కొనేందుకు ఇది కూడా ఒక కారణమంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రంలో కన్నడ భామ అక్షర గౌడ కీ రోల్ పోషిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడు.
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

