సినిమా షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు..ఒకే చోట వందల మంది పోగై పని చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా వెంటనే జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని షూటింగ్ చేయాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇప్పుడు ఇదే జరిగింది. అసలే ఈ మధ్య సినిమా సెట్లలో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు చేరన్ కూడా ప్రమాదానికి గురయ్యాడు. దానికి ముందు భారతీయుడు 2 షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ షూటింగ్ సమయంలో జనరేటర్ ఫిట్ చేయబోయి ఒకరు దుర్మరణం పాలయ్యారు.
ఇప్పుడు మరో ఘటన జరిగింది. తాజాగా కన్నడ సినిమా షూటింగ్లో కరెంట్ షాక్ కొట్టి ఓ వ్యక్తి బలైపోయాడు. మరో వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నాడు. కన్నడనాట మంచి హీరోగా గుర్తింపు ఉన్న అజయ్ రావు (Ajay Rao), స్టార్ హీరోయిన్ రంచిత రామ్ జంటగా లవ్ యూ రచ్చు (Love You Racchu) అనే సినిమా వస్తుంది. ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ మధ్యే మొదలు పెట్టారు. లవ్ యూ రచ్చు షూటింగ్ రామనగర తాలూక జోగర్పాల్య సమీపంలో జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సెకండ్ వేవ్ తర్వాత ఎన్నో జాగ్రత్తల మధ్య షూటింగ్ మొదలు పెట్టారు.
అనుకోని ఘటనతో చిత్ర యూనిట్ అంతా షాక్ లోకి వెళ్లిపోయింది. సెట్లో పని చేస్తున్న సమయంలోనే వివేక్ అనే 28 ఏళ్ళ కుర్రాడు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.. మరొకరికి తీవ్రగాలయ్యాయి. ప్రస్తుతం వివేక్ మృతదేహం రాజరాజేశ్వరనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచారు. గాయపడిన మరో వ్యక్తికి బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ ఘటన బిదాడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దాంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితి ఆరా తీసారు. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ నిలిపేసారు చిత్ర యూనిట్.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?