Shah Rukh Khan | కరణ్ జోహార్ (Karan Johar) దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ (Kuch Kuch Hota Hai ). బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. 1998 అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గత రాత్రి అభిమానుల కోసం ముంబైలో కేవలం రూ.25కే మూడు ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు కరణ్ జోహార్‌తోపాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), రాణీ ముఖర్జీ (Rani Mukerji) సహా ఇతర చిత్ర బృందం హాజరైంది. ఈ సందర్భంగా షారుఖ్.. రాణీ ముఖర్జీ కొంగు పట్టుకొని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షారుఖ్‌ను ‘జెంటిల్మెన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Israel-Hamas War | అన్ని చేతులూ ట్రిగ్గర్‌పైనే.. ఇజ్రాయెల్‌ను మరోసారి హెచ్చరించిన ఇరాన్
Agniveer | అగ్నివీరుడి అంత్యక్రియలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఆర్మీ
Ind Vs Pak Match | స్టేడియంలో బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్న ప్రముఖ నటి