Israel-Hamas War | హమాస్ (Hamas) మిలిటెంట్ల పాలనలోని గాజాపై ఇజ్రాయెల్ (Israel) కొనసాగిస్తున్న దాడులను ఇరాన్ మరోసారి తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది (Iran Warns Israel ). ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంతంలోని అన్ని పార్టీలూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ (Hossein Amirabdollahian) వెల్లడించారు. గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపకపోతే.. ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పైనే (Hands Are On Trigger) ఉన్నాయంటూ గట్టి హెచ్చరికలు చేశారు.
అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా (America) పై కూడా ఇరాన్ విమర్శలు గుప్పించింది. యుద్ధ పరిస్థితిని నియంత్రిస్తామని, ఘర్షణలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని ఎవరూ హామీ ఇవ్వలేరని వ్యాఖ్యానించింది. యుద్ధాన్ని ఆపాలన్న ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను నిరోధించాలని అమెరికాను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించింది.
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ అందులో హెచ్చరించింది. మరోవైపు ఐరాస సమన్వయకర్త టోర్ వెన్నెస్‌ల్యాండ్‌ను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ లెబనాన్ రాజధాని బీరుట్లో కలిసారు. ఈ మేరకు యుద్ధ పరిస్థితిపై చర్చించారు.
గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైన ఇజ్రాయెల్ సైన్యం..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం (Israel-Hamas War) పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు (Hamas) కేంద్రంగా ఉన్న గాజాపై (Gaza) దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్‌కు (Ground Offensive) సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30 వేల మందికిపై బలగాలను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే దాడులకు సర్వం సిద్ధం చేసుకున్నది. ఈ నేపథ్యంలో 10 లక్షలకుపైగా సామాన్య ప్రజలు యుద్ధ క్షేత్రమైన గాజాను విడిచి వెళ్లారని ఐక్యరాజ్య సమితి (UN) వెల్లడించింది. గ్రౌండ్ ఆపరేషన్‌తో హమాస్ గ్రూపు టాప్ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకొన్నది.
కాగా, ఈ యుద్ధంలో రెండు వైపులా మరణాల సంఖ్య 5,200కు పైగా చేరింది. 2,329 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో 1300కి పైగా మరణించగా, ఇజ్రాయెల్ దాడుల్లో 1500 మంది హమాస్ మిలిటెంట్లు హతమయ్యారు.
Also Read..
Israel-Hamas War | అమెరికాలో పాలస్తీనియన్ బాలుడి దారుణ హత్య.. 26 సార్లు కత్తితో పొడిచి..
Joe Biden | గాజాను ఆక్రమించడం పెద్ద తప్పే.. ఇజ్రాయెల్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్