Israel-Hamas War | అమెరికాలో పాలస్తీనియన్ బాలుడి దారుణ హత్య.. 26 సార్లు కత్తితో పొడిచి..
Israel-Hamas War | ఇజ్రాయెల్ - హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా (America) లో జాతి విద్వేష ఘటన చోటు చేసుకుంది. పాస్తీనియన్ - అమెరికన్ బాలుడు (Palestinian-American Boy), అతడి తల్లిపై 71 ఏళ్ల వృద్ధుడు పాశవికంగా దాడికి పాల్పడ్డాడు.
Israel-Hamas War | ఇజ్రాయెల్ – హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా (America) లో జాతి విద్వేష ఘటన చోటు చేసుకుంది. పాస్తీనియన్ – అమెరికన్ బాలుడు (Palestinian-American Boy), అతడి తల్లిపై 71 ఏళ్ల వృద్ధుడు పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మహిళ తీవ్ర గాయాలపాలైంది. అమెరికాలోని ఇల్లినాయిస్ (Illinois)లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించి విల్ కౌంటీ షెరిఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 32 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల కుమారుడితో కలిసి ఇల్లినాయిస్లోని ఓ ఇంట్లో అద్దెకుంటోంది. శనివారం ఉదయం తల్లీ కుమారుడిపై ఇంటి యజమాని 71 ఏళ్ల జోసఫ్ క్యూబా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ వెంటనే 911 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కాపాడాల్సిందిగా పోలీసులను వేడుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే తల్లి, కుమారుడు రక్తపు మడుగుల్లో పడి కనిపించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు. మహిళ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలిపారు.
కాగా, బాలుడి శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జోసఫ్ క్యూబాను అరెస్ట్ చేశారు. అతడిపై జాతి విద్వేషం, హత్య అభియోగాలను నమోదు చేశారు. అయితే, బాధితుల పేర్లు, ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు.
Also Read..
Joe Biden | గాజాను ఆక్రమించడం పెద్ద తప్పే.. ఇజ్రాయెల్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

