Israel-Hamas War | గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైన ఇజ్రాయెల్ సైన్యం.. గాజాను విడిచివెళ్లిన 10 లక్షల మంది
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం (Israel-Hamas War) పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు (Hamas) కేంద్రంగా ఉన్న గాజాపై (Gaza) దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్‌కు (Ground Offensive) సిద్ధమైంది.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం (Israel-Hamas War) పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు (Hamas) కేంద్రంగా ఉన్న గాజాపై (Gaza) దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్‌కు (Ground Offensive) సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30 వేల మందికిపై బలగాలను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే దాడులకు సర్వం సిద్ధం చేసుకున్నది. ఈ నేపథ్యంలో 10 లక్షలకుపైగా సామాన్య ప్రజలు యుద్ధ క్షేత్రమైన గాజాను విడిచి వెళ్లారని ఐక్యరాజ్య సమితి (UN) వెల్లడించింది. గ్రౌండ్ ఆపరేషన్‌తో హమాస్ గ్రూపు టాప్ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకొన్నది.
గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇప్పటివరకూ 2329 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 వేల మందికిపైగా గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ వైపు 1400 మంది మరణించగా, వందలాది మంది అపహరణకు గురయ్యారు.

కాగా, గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ అందులో హెచ్చరించింది. ఐరాస సమన్వయకర్త టోర్ వెన్నెస్‌ల్యాండ్‌ను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ లెబనాన్ రాజధాని బీరుట్లో కలిసారు. యుద్ధ పరిస్థితిపై చర్చించారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

