Ind Vs Pak Match | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా శనివారం జరిగిన మెగా పోరులో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరిగిన ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును తిలకించేందుకు సామాన్య ప్రజలే కాదు పలువురు ప్రముఖులు కూడా తరలివెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించి.. భారత జట్టు విజయాన్ని ఆస్వాదించారు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) కూడా అహ్మదాబాద్ వెళ్లారు. మ్యాచ్ చూస్తూ మైమరచిపోయిన ఊర్వశి.. చివరికి తన విలువైన ఫోన్‌ను పోగొట్టుకుంది.
మ్యాచ్ చూస్తుండగానే తన అత్యంత ఖరీదైన ఐఫోన్ చోరీకి గురైనట్లు నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ (Ind Vs Pak Match) సందర్భంగా తన 24 క్యారెట్ల బంగారు ఐఫోన్ (24 Carat Real Gold iPhone) పోగొట్టుకున్నట్లు తెలిపింది. ఫోన్ దొరికితే తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా వేడుకుంది. ఈ విషయంలో తనకు సహకరించాల్సిందిగా కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేసింది.
📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice
Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023
Also Read..
Israel-Hamas War | అమెరికాలో పాలస్తీనియన్ బాలుడి దారుణ హత్య.. 26 సార్లు కత్తితో పొడిచి..
Joe Biden | గాజాను ఆక్రమించడం పెద్ద తప్పే.. ఇజ్రాయెల్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
Rohit Sharma | ఇది బ్యాట్ పవర్ కాదు బాస్.. బాడీ పవర్.. అంపైర్‌కు రోహిత్ శర్మ అదిరిపోయే రిప్లే