Rohit Sharma | ఇది బ్యాట్ పవర్ కాదు బాస్.. బాడీ పవర్.. అంపైర్‌కు రోహిత్ శర్మ అదిరిపోయే రిప్లే
వరల్డ్‌కప్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ సిక్సర్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
Rohit Sharma | వరల్డ్‌కప్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ సిక్సర్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ హిట్టింగ్‌కు ముగ్దుడైన అంపైర్ ఎరాస్మస్ (Umpire Marais Erasmus).. రోహిత్‌ను ఓ వింత ప్రశ్న అడిగాడు.
‘బ్యాట్‌లో ఏం పెట్టుకొచ్చావు.. అంత బలంగా బాదుతున్నావు’ అని అంపైర్ అనగా.. దానికి రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘ఇది బ్యాట్ పవర్ కాదు.. బాడీ పవర్’ అంటూ తన కండలు చూపించాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ఈ అంశాన్ని గుర్తు చేస్తూ.. నవ్వులు పూయించాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా హ్యాట్రిక్ విజయాలతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

రోహిత్‌తో మామూలుగా ఉండదు!
టీమ్ఇండియాలో మతిమరుపుకు, బద్దకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రోహిత్.. అహ్మదాబాద్‌లో తొలి బంతి నుంచే వీరంగమాడాడు. ఇన్నింగ్స్ మొదటి బాల్కే బౌండ్రీ కొట్టి పరుగుల దండయాత్ర ప్రారంభించిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత సిక్సర్లతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే పాక్ బౌలర్ హరీస్ రవుఫ్‌ను రోహిత్ ఓ ఆటాడుకున్నాడు. పదే పదే భారీ షాట్లకు దిగుతూ అతడికి చుక్కలు చూపాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో భారత్ తరఫున 300 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు.
— Rohit Sharma Trends™ (@TrendsRohit) October 15, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

