KTR | ఇటీవలే తన కూతురు గాయత్రి ఆకస్మిక మరణంతో ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తీవ్ర శోకసంద్రంలో ఉన్నారని తెలిసిందే. ఈ మేరకు ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఇవాళ రాజేంద్రప్రసాద్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు.
రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ గాయత్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రాజేంద్రప్రసాద్‌ను ఓదార్చిన కేటీఆర్ ఆయనలో మనోధైర్యాన్ని నింపారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్ తదితరులు ఉన్నారు.
రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె (గాయత్రి) ఉన్నారు. కాగా గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించింది.
సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/MyJEY3pdJo
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్