Koratala Siva | తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈయన. చేసిన నాలుగు సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కొరటాల. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అసలైన పరీక్ష ఎదురు కానుంది. దాని పేరు రాజమౌళి ఫోబియా.. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో తర్వాత ఇండస్ట్రీలో ఏ దర్శకుడితో పని చేసినా కూడా ఫ్లాప్ ఇస్తాడు. ఇది ఇప్పటి నుంచి వస్తున్న సెంటిమెంట్ కాదు.. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది.
ప్రభాస్ కూడా దీని నుంచి తప్పించుకోలేకపోయాడు. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సాహో తెలుగులో డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్.. కేవలం నెల రోజుల గ్యాప్‌లోనే ఆచార్య సినిమాతో వస్తున్నాడు. చిరంజీవి ఇందులో హీరో అయినా కూడా చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్‌లో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే రాజమౌళి తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో ఒక రకమైన భయం కూడా ఏర్పడింది. రాజమౌళి సినిమా తర్వాత చరణ్‌కు హిట్ ఇచ్చే బాధ్యతను కొరటాల శివ తీసుకున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత కూడా ఈయనే తీసుకున్నాడు. త్వరలోనే తారక్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు కొరటాల.
మొత్తానికి ట్రిపుల్ ఆర్ వంటి సంచలన విజయం తర్వాత అటు రామ్‌చరణ్.. ఇటు ఎన్టీఆర్‌కు హిట్ ఇచ్చే బాధ్యతను కొరటాల శివ తీసుకోవం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
కొరటాల శివకు డెడ్ లైన్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్..”
“Dil Raju With NTR | క్రేజీ టాక్..9 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్‌తో దిల్ రాజు..!”
“Ram Charan | ఆచార్యలో రాంచరణ్ కనిపించేది ఎంతసేపంటే..?”
Jr NTR | నో రెస్ట్ అంటోన్న ఎన్టీఆర్..కొరటాల సినిమా షురూ అయ్యేది అప్పుడే.!”