Junior NTR | ట్రిపుల్ ఆర్ సినిమా సినిమా తర్వాత వరుసగా కమిట్మెంట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నా కూడా చివరి నిమిషంలో ఆ సినిమా పక్కకు వెళ్లిపోయింది. దీంతో కొరటాల శివ లైన్లోకి వచ్చాడు. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. కథ విన్న వెంటనే జూనియర్ ఎన్టీఆర్ బాగా ఎగ్జైట్ అయ్యాడని తెలుస్తుంది. ఇందులో నాగ తరహాలో స్టూడెంట్ లీడర్‌గా ఎన్టీఆర్ నటించబోతున్నాడని ముందు వార్తలు వచ్చినా కూడా.. కాదు రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యంలో ఏ సినిమా చేయలేదు. అప్పట్లో నాగ సినిమా చేసినా అది స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కొరటాల సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ పాత్రను కొరటాల చాలా చాకచక్యంతో రాశాడని.. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివకు ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు కొరటాల. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెండు వారాలు కేటాయించాడు దర్శకుడు కొరటాల శివ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తారక్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమాను కేవలం 70 రోజుల్లో పూర్తి చేయాలని జూనియర్ ఎన్టీఆర్ కోరుతున్నట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో కొరటాల కూడా ఈ చాలెంజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. ఈ తొమ్మిదేళ్లలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడు. అందులో ఆచార్య ఇంకా విడుదల కాలేదు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ సినిమాను 70 రోజుల్లోనే పూర్తి చేస్తాడో లేదో చూడాలి..!
NTR political entry | పొలిటికల్ ఎంట్రీ గురించి జూ.ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్..”
Rakhi Sawant | డ్యాన్స్ చేయాలని అడిగిన రాఖీసావంత్..ఆర్ఆర్ఆర్ హీరోల రిప్లై ఇదే”
Jr NTR | ఆ ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్లతో రెడీ అంటున్న ఎన్టీఆర్..!”
జూనియర్ ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంతంటే..?”