టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో రాంచరణ్ (Ram Charan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నిడివి ఎంత ఉండనుందే అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఆచార్య రన్ టైం సుమారు 3 గంటలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా రాంచరణ్ పాత్రకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఆచార్యలో రాంచరణ్ పాత్ర నిడివి సుమారు 20-25 నిమిషాలు ఉండబోతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు చాలా బాగా రావడమే కాకుండా..ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేలా ఉండనున్నాయట. ఈ చిత్రంలో కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పూజాహెగ్డే మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్స్ అందించిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి మరోవైపు లూసిఫర్, బోళా శంకర్, చిరు 154 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 మూవీ చేస్తున్నాడు.