Committee Kurrollu | టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల సమర్పణలో యదువంశీ దర్శకత్వం వహించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu). శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మజా కొణిదెల, జయలక్ష్మి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కాగా.. సూపర్ టాక్ తెచ్చుకుంది.
ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచిచెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందించిన ఈ మూవీపై ఇప్పటికే టాప్ సెలబ్రిటీలు మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, నాని, దేవీ శ్రీ ప్రసాద్, రాంచరణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన కమిటీ కుర్రోళ్లు ఇక ఓటీటీ, టీవీల్లో సందడి చేయబోతున్నారు. కమిటీ కుర్రోళ్లు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 12న ఓటీటీలో సందడి చేయనుంది. మరోవైపు ఈటీవీలో టెలివిజన్ ప్రీమియర్ కానుండగా.. త్వరలోనే తేదీపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక కీలక పాత్రల్లో నటించారు.
Prasanth Varma | హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సస్పెన్స్.. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో ..?
Venkat Prabhu | ది గోట్ సినిమాకు తలైవా, ధనుష్ ఫస్ట్ చాయిస్ అట.. వెంకట్ ప్రభు ఏమన్నాడంటే..?
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్