కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు మారన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నేటితో 38వ పడిలోకి అడుగుపెడుతున్నాడు ధనుష్. ఈ సందర్భంగా ధనుష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..మారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ధనుష్ చేతిలో పెన్ను పట్టుకుని ఓ వ్యక్తిని కొడుతూ..సీరియస్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
ధనుష్ తో ప్రతీ రోజు సెట్లో ఉండి ఎంతో నేర్చుకున్నా. ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు నన్ను బెటర్ ఫిల్మ్ మేకర్ గా మార్చాయి. ధనుష్ సార్ కు హ్యాపీ బర్త్ డే. మీ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని, మీకు అంతా మంచి కోరుకుంటున్నట్టు కార్తీక్ నరేన్ ట్వీట్ చేశాడు.
టాలెంటెడ్ స్వీట్ హర్ట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాధికా శరత్‌కుమార్ ట్వీట్ చేసింది. వీరితోపాటు ఖుష్బూ సుందర్, మాళవిక, రాశీఖన్నా ధనుష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..