కీలక రంగాల్లో నిస్తేజం
కీలక రంగాల్లో నిస్తేజం నెలకొన్నది. బొగ్గు, సహజ వాయు వు, క్రూడాయిల్, ఎరువుల విభాగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ఆగస్టు నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత నెలకుగాను 4.8 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6.2 శాతంతో పోలిస్తే భారీగా పడిపోగా, జూలై నెలలో నమోదైన 5 శాతం తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం.
- మూడు నెలల కనిష్ఠానికి పడిపోయిన వృద్ధి
- ఆగస్టు నెలలో 4.8 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కీలక రంగాల్లో నిస్తేజం నెలకొన్నది. బొగ్గు, సహజ వాయు వు, క్రూడాయిల్, ఎరువుల విభాగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ఆగస్టు నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత నెలకుగాను 4.8 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6.2 శాతంతో పోలిస్తే భారీగా పడిపోగా, జూలై నెలలో నమోదైన 5 శాతం తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం.
మే నెలలో నమోదైన 3.2 శాతం కంటే అధికం. గత నెలలో బొగ్గు ఉత్పత్తి 3.8 శాతానికి పడిపోగా, అలాగే సహజ వాయువు 4.9 శాతం, క్రూడాయిల్ 3.6 శాతం, ఎరువులు 12.4 శాతానికి పడిపోయాయి. అలాగే రిఫైనరీ ఉత్పత్తులు 2.6 శాతం, స్టీల్ 3.4 శాతం, ఖనిజం ఉత్పత్తిలో వృద్ధి 5.5 శాతానికి పడిపోయాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వరుసగా 3.4 శాతంగాను, 15.3 శాతం, 7.9 శాతంగా నమోదయ్యాయి. కానీ, గత నెలకుగాను సిమెంట్ రంగం 12.5 శాతం వృద్ధిని నమోదుచేసుకోగా, విద్యుత్ రంగం 11.6 శాతం వృద్ధి నమోదైంది.
మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో కీలక రంగాలు 4.3 శాతం వృద్ధిని కనబరిచాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికిగాను 2.4 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా ఇక్రా లిమిటెడ్ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ..గత నెలలో వార్షిక ప్రతిపాదికన కీలక రంగాల్లో వృద్ధి నెమ్మదించిందని, ప్రధానంగా తొమ్మిది రంగాల్లో ఆరు రంగాల పనితీరు క్షీణించిందని చెప్పారు. గనులకు సంబంధించిన బొగ్గు, ఖనిజ ఉత్పత్తి రంగాలు మెరుగైన పనితీరు కనబర్చడం వల్లనే ఈ మాత్రమైన వృద్ధిని సాధించిందని తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయంగా ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

