హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తెలంగాణ
దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. ఈ మేరకు సోమవారం టీ-హబ్‌లో ‘బయాండ్ నంబర్స్-ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్' అనే అంశంపై ‘హోమా సీఎంఈ-2026’ పేరిట నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు.
- హోమా సీఎంఈ 2026’ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. ఈ మేరకు సోమవారం టీ-హబ్‌లో ‘బయాండ్ నంబర్స్-ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్’ అనే అంశంపై ‘హోమా సీఎంఈ-2026’ పేరిట నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్టార్టప్ రంగాలను హెల్త్ కేర్‌తో సమర్థవంతంగా అనుసంధానం చేసే కాంప్రహెన్సివ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మెడిసిన్‌ను టెక్నాలజీతో మిళితం చేస్తున్నామని తెలిపారు. మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వీటిని కేవలం సంప్రదాయ వైద్య విధానాలతోనే కాకుండా, లైఫ్సె్టైల్ డాటాను విశ్లేషించడం ద్వారా సమర్థవంతంగా ఎదురొనేందుకు అవకాశముందని చెప్పారు.
ఈ తరహా దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాల్సిన అవసరముందని, ఆ దిశగా మరిన్ని నూతన ఆవిషరణలు రావాలని కాంక్షించారు. రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను పరిషరించే కొత్త ఆలోచనలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్ ప్లోరర్’ను ప్రారంభించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

