KA Trailer | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ క (KA). 970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న క ట్రైలర్ రానే వచ్చింది. ట్రైలర్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ క్యూరియాసిటీ పెంచుతోంది.
పోస్టు మాస్టర్ వాసుదేవ్‌గా కనిపించబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతుందని వాసుదేవ్ ఓ గ్రామస్థుడిని అడిగితే.. మా ఊరు చుట్టూ ఎత్తెన కొండలుంటాయి. కొండల మధ్యలో మా ఊరుంటుంది. మధ్యాహ్నం మూడయ్యే సరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి.. ఆ నీడ మా ఊరి మీద పడి 3 గంటలకే చీకటి పడిపోతుందబ్బాయి.. అంటూ సాగుతున్న సంభాషణలు క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
చీకటి వలయం.. గందరగోళం.. ఏప్రిల్ 22 1977 ఆ రోజు నీకొచ్చిన ఉత్తరాన్ని తెరిచి చదివావు. అందులో ఏముంది.. అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి అడుగుతున్నాడు. ఇంతకీ ఉత్తరంలో ఏముంది..? వాసుదేవ్ ఆ ఉత్తరాన్ని చదివి ఏం చేశాడనేది సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది.
ఇదివరకెన్నడూ నయా అవతార్‌లో ఎంటర్టైన్ చేయబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. టైం ట్రావెల్ కథాంశం చుట్టూ తిరిగే క చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
క ట్రైలర్..
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?