Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun)- సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రంలో సమంత-అల్లు అర్జున్‌పై వచ్చే ఊ అంటావా సాంగ్‌కు ఏ రేంజ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో అదే ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు వస్తోంది పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సీక్వెల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్, శ్రీలీలపై వచ్చే స్పెషల్ నంబర్ కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను లాంచ్ చేశారు.
కాగా ఈ పాటపై సమంత సోషల్ మీడియాతో తన స్పందన తెలియజేసింది. ఈ పాటలో శ్రీలీల తన డ్యాన్స్‌తో స్టేజ్‌పై సెగలు పుట్టించింది. మూడు ఫైర్ ఎమోజీలు పెడుతూ.. చంపేశావ్.. అని కామెంట్ చేసింది. అంతేకాదు సైలెంట్‌గా ఉండండి.. పుష్ప 2 కోసం వెయిట్ చేయండి.. అని క్యాప్షన్ ఇచ్చింది. కేవలం 18 గంటల్లోనే 25 మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టింది. కిస్సిక్ సాంగ్ 24 గంటల్లోపే ఈ అరుదైన రికార్డు నెలకొల్పిన దక్షిణాది పాటగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో వచ్చే ఈ పాటను చంద్రబోస్ రాయగా.. సింగర్ Sublahshini పాడింది. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్ట్‌కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన డీఎస్పీ మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్