భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక అప్ డేట్ షేర్ చేసుకుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన త్రోబ్యాక్ స్టిల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అండర్ వాటర్ అడ్వెంచర్ కు సంబంధించిన స్టిల్ పర్సనల్ ఆల్బమ్ లో నుంచి తీసి అందరితో పంచుకుంది. ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో సముద్ర నీటిలో జలకాలాడుతున్న ఫొటోతో..నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్న కైరా..ఈ త్రోబ్యాక్ స్టిల్‌తో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. గతేడాది డిసెంబర్ లో తన బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాతో మాల్దీవుల్లో చక్కర్లు కొట్టింది కైరా. అందుకు సంబంధించిన స్టిల్స్ కూడా ఇప్పటికే ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి.
ఇవి కూడా చదవండి..
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?