Kiara Advani | బాలీవుడ్ స్టార్ నటి కియారా అడ్వాణీ (Kiara Advani) బేబీ బంప్‌తో దర్శనమిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటైన మెట్‌గాలా సోమవారం ఉదయం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art)లో జరిగిన ఈ గాలాలో కియారా సందడి చేశారు. బ్లాక్ డ్రెస్‌లో హొయలు పోయారు.
Kiara Advani (@advani_kiara ) in custom Gaurav Gupta Couture titled ‘Bravehearts’ at her debut Met Gala.
A tribute to defiance, legacy, and new beginnings.
Bravehearts is built on the spirit of the Black Dandy — those who challenged norms and reshaped culture with grace,… pic.twitter.com/X8cALQ93VM— Gaurav Gupta Couture (@GG_Studio) May 6, 2025
కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత కియారా బేబీ బంప్‌తో కనిపించడం ఇదే తొలిసారి. అదేవిధంగా తొలిసారి మెట్‌గాలాలో అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్‌లో తళుక్కుమన్నారు. బేబీ బంప్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Gorgeous kiara advani #KiaraAdvani pic.twitter.com/zhcC0gLeD8
— ActressFanWorld (@ActressFanWorld) May 6, 2025
మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది.
You did great, MAMA. ♥️#KiaraAdvani’s iconic MET Gala debut also marked her as the first Indian actress to walk the carpet with a baby bump.#Trending pic.twitter.com/OJs8Zk4UUE
— Filmfare (@filmfare) May 5, 2025
ఈ ఏడాది మెట్‌గాలాలో బాలీవుడ్ స్టార్ నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కియారా అడ్వాణీ (Kiara Advani), ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్, సింగర్ దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) తదితరులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
#KiaraAdvani makes her #MetGala2025 debut❤️ pic.twitter.com/0EMXhhrryl
— kiara! (@kiaraaalia) May 5, 2025
Kiara Mommyyy 😍❤🔥
She is just so pretty 😘#KiaraAdvani pic.twitter.com/l6py0l9py2— Arya (@Arya5508) May 6, 2025
She’s so ethereal MOMMY!❤🖤#KiaraAdvani#MetGala2025 pic.twitter.com/EjAPgfllkD
— Aϻan☆ (@AmanTanti4) May 6, 2025
Also Read..
Ram Charan | రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ.. లండన్‌లో ప్రత్యక్షమైన చిరు ఫ్యామిలీ
Upendra | ఆరోగ్యం క్షీణించి ఉపేంద్ర ఆసుపత్రిలో చేరారా.. ఇదిగో క్లారిటీ..!
Samantha | నిర్మాతగా నా లక్ష్యమదే.. అక్కడ చేసిన ప్రతీ సినిమా హిట్: సమంత