Samantha | అగ్ర కథానాయిక సమంత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. హర్షిత్ రెడ్డి, శ్రియా, శ్రావణి, షాలినీ, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదివారం విశాఖపట్నంలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..
‘నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ కొత్త కథల్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ బ్యానర్‌ను స్థాపించాను. వైజాగ్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. వైజాగ్ అభిమానుల్ని చూసి నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది’ అని చెప్పింది. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి హారర్ కామెడీ కథ రాలేదని, సమంత వల్లే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చిందని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెలిపారు.
బుల్లితెరలో వచ్చే సీరియల్స్‌ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటారని, కానీ వాటిపై తనకు చాలా గౌరవం ఉందని, అదే పాయింట్‌ను ఈ సినిమాలో హారర్ ఫార్మెట్లో చూపించామని రచయిత వసంత్ మరిగంటి పేర్కొన్నారు. వినూత్న కథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని చిత్ర తారాగణం ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: క్లింటన్ సెరెజో.