ఇండియన్ సినీ పరిశ్రమకు కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ నందించిన సంస్థ హోంబలే ఫిలిమ్స్. బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ ముందే తెలియజేసిన కేజీఎఫ్ మేకర్స్ తాజాగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ లీడ్ రోల్ లో భారీ చిత్రాన్నిప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు టైటిల్ ద్విత్వ. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. సెప్టెంబర్ నుంచి ద్విత్వ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ చిత్రం కన్నడతోపాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కానుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ద్విత్వలో పలువురు తెలుగు స్టార్లు కూడా కనిపించనుండటంతో ఇక్కడి ఆడియెన్స్ లో సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తోండగా..శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు కేజీఎఫ్ చాఫ్టర్-2 కూడా విడుదలకు రెడీ అవుతోంది.
We bring forward 𝐃𝐕𝐈𝐓𝐕𝐀.
— Hombale Films (@hombalefilms) July 1, 2021
A unique Psychological Drama Thriller starring @PuneethRajkumar, directed by @Pawanfilms.@VKiragandur @hombalefilms @HombaleGroup @DvitvaMovie @preethaj #PoornaChandraTejaswi @KRG_Connects #Dvitva #HombaleFilms pic.twitter.com/rWM7cMFcGE
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Recommended Content by ntnews.com