కన్నడ స్టార్ యాక్టర్ యశ్ (Yash) మెయిన్ లీడ్‌లో నటిస్తున్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకుడు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నియమనిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం టికెట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించింది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా టికెట్స్ ధరలు పెంచింది.
మల్టీప్లెక్స్ లో టికెట్ ధరను రూ.350గా, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.210గా నిర్ణయించింది.
విడుదలైన తర్వాత మొదటి నాలుగు రోజులకు ఈ ధరలు అమలులో ఉండనున్నాయి. ఈ మూవీ నుంచి ‘ ఎదగరా ఎదగరా దినకరా..’ పాటను ఇప్పటికే విడుదల చేయగా..మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. కేజీఎఫ్ 2 ట్రైలర్‌కు క్లాస్, మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే యశ్ అండ్ టీం వైజాగ్‌లో ప్రమోషన్స్ ప్రెస్ మీట్లో పాల్గొన్నది.
శ్రీనిధి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీలో రవీనాటాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.