Gadchiroli Encounter : మహారాష్ట్రలోని గడ్జిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత నేలకొరిగారు. పోలీసుల కాల్పుల్లో కామారెడ్డికి చెందిన మావోయిస్తు ప్రభాకర్ (Prabhakar) మృతి చెందారు. గడ్చిరోలి డివిజనల్ అధిపతిగా ఉన్న ప్రభాకర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్ట్ పార్టీ కీలక నేతలను కోల్పోతోంది. ఇప్పటికే దండకారణ్యంలో జరిగిన పలు ఎన్కౌంటర్లో ప్రముఖ మావోయిస్టులు నంబాల కేశవరావు, హిడ్మా తదితరులు అసువులు బాయగా.. ఇప్పుడు గడ్చిరోలీ డివిజన్ అధిపతి ప్రభాకర్ సైతం మృతి చెందారు. భమ్రగడ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతం శుక్రవారం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక పోలీస్ కూడా ప్రాణాలు విడిచారని సమాచారం.