బూర్గంపహాడ్, జూలై 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ముత్యాలమ్మపేట ఏరియాలోని 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ కిశోర్‌నాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం ఏర్పడిన అనతి కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక పంచాయతీ సారపాక అని తెలిపారు. ప్రతి గల్లీకి సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని, దీనికి పాలకవర్గ సభ్యుల కృషి గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, 13, 14వ వార్డు సభ్యులు మూలం నవ్యశ్రీ, కొమరం సావిత్రి, మండల అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోతిరెడ్డి అశోక్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, రమేష్, చందు, స్వాతి, సత్యనారాయణ, వెంకటరెడ్డి పాల్గొన్నారు.