T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో ఆడాలనుకున్న పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రానా (Harshit Rana) కల చెదిరింది. ఇటీవల అద్భుతంగా రాణించి స్క్వాడ్‌లోకి వచ్చిన రానా.. అనూహ్యంగా ఆరంభానికి ముందే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న అతడు వైదొలగడంతో.. అతడి స్థానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) వరల్డ్‌కప్ స్క్వాడ్‌లోకి వచ్చాడు. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
వైట్‌బాల్ ఫార్మాట్లో విశేషంగా రాణిస్తూ నయా ఆల్‌రౌండర్‌గా ఆవిర్భవించిన హర్షిత్ రానా ప్రపంచకప్ పోటీలకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ అనంతరం గాయపడిన అతడు ఇంకా కోలుకోలేదు. మోగాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ పేసర్‌ను శుక్రవారం పరీక్షించిన ఫీజియోలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో.. రానా స్థానంలో సీనియర్ పేసర్ సిరాజ్‌కు స్క్వాడ్‌లో చోటు దక్కింది. వరల్డ్‌కప్ రేపటి నుంచి ప్రారంభం కానుండగా ముంబైలోని వాంఖడేలో యూఎస్ఏతో టీమిండియా తలపడనుంది.
🚨 SIRAJ TIME IN T20 WORLD CUP. 🚨
– Mohammed Siraj has been picked as Harshit Rana’s replacement for the T20 World Cup. (Express Sports). pic.twitter.com/nTyNSHqgJV
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2026
భారత టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇసాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్. వరుణ్ చక్రవర్తి. సిరాజ్.
శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) మాట్లాడుతూ రానా ఆడడంపై సందేహాలు వెలిబుచ్చాడు. ‘దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ తర్వాత హర్షిత్ రానా గాయపడ్డాడు. ప్రస్తుతానికైతే అతడి ఆరోగ్యం మెరుగవ్వలేదు. అలాఅనీ ప్రపంచకప్ నుంచి రానా వైదొలిగాడని చెప్పలేం. ఫిజియో అతడిని పరీక్షిస్తాడు. ఈరోజుతో మాకు రానా ఆరోగ్యంపై అప్డేట్ వస్తుంది.ఒకవేళ అతడికి ఇంకా నయం కాలేదంటే అది మాకు విచారకరం.
అయితే.. ఆందోళన చెందాల్సిందేమీ లేదు. రేపు యూఎస్ఏతో ఆడేందుకు ఫిట్‌గా పదకొండు మంది ఉన్నారు. కానీ, కాంబినేషన్లను బట్టే స్క్వాడ్‌లోకి రానాను తీసుకున్నాం. ఇప్పుడు అతడు అందుబాటులో లేకుంటే మార్పులు చేయక తప్పదు. ప్రస్తుతం స్క్వాడ్‌లో అవసరమైనన్ని కాకాంబినేషన్లు ఉన్నాయి. ఏదిఏమైనా రానాను మిస్ కావాల్సి వస్తే అది ఒకింత కష్టమైన విషయమే’ అని సూర్య వెల్లడించాడు.