BRS – CPI : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలేలా ఉంది. ఎందుకంటే సింగరేణిలో అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్కు బుద్ది చెప్పేందుకు సీపీఐ నేతలు బీఆర్ఎస్కు మద్దతిస్తున్నారు. ఒకప్పుడు సింగరేణి అంటే స్కీములు.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణి అంటే స్కాములకు కేరాఫ్ అయిందన సీపీఐ నాయకుడు సీతారామయ్య వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ను ఓడిస్తామని సీపీఐ నేత సీతారామయ్య తెలిపారు. సింగరేణిలో కాంగ్రెస్ అక్రమాలు చూడలేకనే మున్సిపల్ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో కలిసి శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సీతారామయ్యతో పాటు భారీ సంఖ్యలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీర్ఎస్తో కలిసి పోటీ చేస్తున్నామని.. కాంగ్రెస్ ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇలాగే అవినీతి జరిగితే వచ్చే10 ఏళ్లలో సింగరేణి కనపడకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. కాంగ్రెస్కు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో చేస్తున్న అక్రమాలు చూడలేక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము
ఒకప్పుడు సింగరేణి అంటే స్కీములు, ఇప్పుడు సింగరేణి అంటే స్కాములు
ఇలాగే అవినీతి జరిగితే 10 ఏళ్లలో సింగరేణి కనపడకుండా పోతుంది – సీపీఐ నాయకుడు సీతారామయ్య pic.twitter.com/QhTYV1ZhVx
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2026