Alia bhatt Netizen Post | సచ్చావ్ పో..నెటిజన్‌కు ఆలియా కౌంటర్..వీడియో వైరల్
కాబోయే వధూవరులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ (Alia bhatt-Ranbhir Wedding) పెళ్లి సంగతులు లీక్ అవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయినా నెటిజన్స్ ఊరుకోవడం లేదు.తాజాగా ఓ నెటిజన్ (Alia bhatt Netizen Post) ఆలియా-రణ్‌బీర్ పెళ్లి జరగడం తట్టుకోలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
వివాహ ముహూర్తం దగ్గర పడుతున్నా కొద్దీ అసాధ్యమైనంత ప్రైవసీ మెయింటేన్ చేస్తున్నారు కాబోయే వధూవరులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ (Alia bhatt-Ranbhir Wedding). ఇళ్ల దగ్గర టైట్ సెక్యూరిటీతో పాటు సోషల్ మీడియాలోనూ ఏ విషయం, ఫొటోలు, పెళ్లి సంగతులు లీక్ అవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయినా నెటిజన్స్ ఊరుకోవడం లేదు. వాళ్ల ఆసక్తి, ఉత్సాహం.. స్పందించేలా ఈ జంటను రెచ్చగొడుతున్నది.
తాజాగా ఓ నెటిజన్ (Alia bhatt Netizen Post) ఆలియా-రణ్‌బీర్ పెళ్లి జరగడం తట్టుకోలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టులో..వేగంగా వెళ్తున్న కారు వెనక ఆలియా (Alia bhatt) వెడ్స్ రణ్‌బీర్ అని రాసి ఉంది. ఆ కారును వెంబడిస్తూ కబీర్ సింగ్ సినిమాలో కియారా అద్వానీ పెళ్లి వార్త విన్న షాహిద్ కపూర్ పరుగెట్టినట్లు రోడ్ల మీద పరుగెత్తుతూ వీడియో పోస్ట్ చేశాడు.
ఆలియా పక్కన తన స్థానంలో రణ్‌బీర్ ఉన్నట్లు ఫొటో మార్ఫింగ్ చేశాడు. ఏప్రిల్ 17న నేను.. అంటూ హార్ట్ బ్రేక్ సింబల్ (Alia bhatt).పెట్టాడు. చూడగానే నవ్వొచ్చేలా ఉన్న ఈ పోస్టుకు ఆలియా స్పందించకుండా ఉండలేకపోయింది. ఆలియా రిప్లై ఇస్తూ డెడ్ అని నవ్వుతూ పోస్టు చేసింది.
ఆలియా రిప్లై కూడా హ్యూమరస్ గా ఉంది. నాలుగు రోజుల పాటు ఆలియా, రణ్‌బీర్ పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ఏప్రిల్ 13న మెహందీతో మొదలై 17న రిసెప్షన్ తో ముగియనుంది. ఏప్రిల్ 14న ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

