టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కొత్త పోస్టర్..పవన్ కల్యాణ్‌ను కంప్లీట్ న్యూ అవతార్‌లో చూపిస్తుంది. తాజాగా పవన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం కోసం పవన్ ఫుల్యాక్షన్ మూడ్‌లోకి దిగిపోయాడు. ప్రస్తుతం సుమారు 1000 మంది ఆర్టిస్టులతో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది క్రిష్ టీం. ఈ యాక్షన్ పార్టు సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందట. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై రోమాలు నిక్కపొడుచుకునేలా వెయ్యి మందితో ఫైట్ సీన్ ఉండబోతుందని టాక్ ఆఫ్ ది టౌన్ లా నిలువబోతుందని సమాచారం. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటిస్తోంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.