విజయ్-పూజాహెగ్డే కాంబినేషన్లో వస్తోన్న చిత్రం బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రచారంలో భాగంగా బీస్ట్ టీం ఇవాళ హైదరాబాద్‌లో సందడి చేసింది. ప్రెస్‌మీట్ (Beast Telugu Press Meet) ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఈవెంట్లో హిట్ ట్రాక్ హలమితి హబిబో సాంగ్‌కు పూజాహెగ్డే (Pooja hegde) స్టేజీపై బెల్లీ డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేసింది. పూజాహెగ్డేతో డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ అనిరుధ్ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
#PoojaHegde & #AnirudhRavichander Halamati-fies the Press Meet today in Hyderabad as they dances for #ArabicKuthu Song @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @SVC_official #BeastModeON #BeastMovie pic.twitter.com/W5mT5oViIg
— Suresh Kondi (@SureshKondi_) April 8, 2022
ఈ సందర్భంగా పూజాహెగ్డే మాట్లాడుతూ..నేను తమిళంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. డార్క్ కామెడీ నేపథ్యంలో వస్తున్న బీస్ట్‌లో జాయిన్ కావడం సంతోషంగా ఉంది. అనిరుధ్ సంగీతం నా ప్లే లిస్టును శాసిస్తుంది. ప్రొఫెషనల్ హీరో అయిన దళపతిని ఈ ఈవెంట్లో మిస్ అవుతున్నామని చెప్పుకొచ్చింది.