Prashanth Neel | ‘అది నా స్టైల్..సలార్ తాజా కథ’..పుకార్లపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'సలార్' (Salaar). పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.
మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ‘సలార్’ (Salaar). ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరో క్రేజీ గాసిప్ తెరపైకి వచ్చింది.
అదేంటంటే ప్రశాంత్ నీల్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ చిత్రం ఉగ్రమ్ (Ugramm). లేటెస్ట్గా తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రం ఉగ్రమ్‌కు రీమేక్ అని కొన్ని వెబ్సైట్లు కథనాల్లో రాసుకొచ్చాయి. అయితే మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు సలార్ కథ గురించి వస్తున్న పుకార్లపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. నేను తీసిన, తీయబోయే ప్రతీ సినిమాలో ఉగ్రమ్ మూవీ షేడ్స్ కొంత కనిపిస్తుంటాయి. అది నా స్టైల్. కానీ సలార్ తాజా కథ. ఇది రీమేక్ కాదు..ఉగ్రమ్‌కు అడాప్షన్ అంతకంటే కాదేని క్లారిటీ ఇచ్చాడు.
ఏ ప్రాంచైజీతో సంబంధంలేని ఫ్రెష్ స్టోరీ ‘సలార్’ అని ప్రశాంత్ నీల్ చెప్పిన స్టేట్మెంట్తో స్పష్టత వచ్చేసింది. ప్రభాస్ గతంలో ఎన్నడూ కనిపించని డైనమిక్ రోల్లో కనిపించబోతున్నాడు. కోలీవుడ్ భామ శృతిహాసన్ (Sruthi Haasan) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకున్న అప్ డేట్ ప్రకారం సలార్ 30 శాతం షూటింగ్ పూర్తయింది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF Chapter 2)ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also : Sunny Leone | మంచు విష్ణును భయపెట్టిన సన్నీలియోన్..వీడియో హల్చల్
కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్టు కే షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీంతోపాటు ఓం రావత్‌తో ఆదిపురుష్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో కామెడీ ఎంటర్టైనర్ కూడా చేయబోతున్నాడు.
Read Also : Pawan kalyan Martial Arts | మార్షల్ ఆర్ట్స్ సెషన్లో ‘హరిహర వీరమల్లు’..స్టైల్ అదిరింది
Read Also : Rashmika Mandanna | ‘నాలో ఏదో తెలియని ఫీలింగ్’..రష్మిక ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

