కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) మెయిన్ లీడ్ రోల్ చేస్తోన్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 2022 ఏప్రిల్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు పాన్ ఇండియా లవర్స్ కోసం ఎవరూ ఊహించని అప్ డేట్ అందించారు మేకర్స్.
బ్లాక్ బాస్టర్ హిట్టుగా కలెక్షన్ల వర్షం కురిపించిన కేజీఎఫ్ చాఫ్టర్ 1 (KGF chapter 1)ను రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. దేశవ్యాప్తంగా నిర్దేశించిన ప్రాంతాల్లో రీరిలీజ్ చేస్తున్నారు. సబ్సిడీ ధరలకే కేజీఎఫ్ ఫస్ట్ పార్టును వీక్షించే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ సినిమా విడుదలయ్యేది ఎప్పుడనే కదా మీ డౌటు. రెండోపార్టు వచ్చే కంటే సరిగ్గా 6 రోజుల ముందు అంటే ఏప్రిల్ 8న ఫస్ట్ పార్టు రీరిలీజ్ అవుతుంది. మొత్తానికి చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన కేజీఎఫ్ 2 ప్రమోట్ చేయడంలో భాగంగా ఫస్ట్ పార్టును విడుదల చేయడం..కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
సినీ లవర్స్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2 ట్రైలర్ ను మేకర్స్ ఇటీవలే లాంఛ్ చేశారు. ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. కన్నడతోపాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.