Revolver Rita Teaser | మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీగా నిలిచింది కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఓ వైపు గ్లామరస్ పాత్రలతో పాటు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్న ఈ భామ తాజాగా రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ (Revolver Rita Teaser)ను విడుదల చేశారు మేకర్స్. మేకర్స్ లాంచ్ చేసిన టీజర్.. రివాల్వర్ రీటాగా కీర్తి మార్క్ హ్యూమర్ టచ్‌తో యాక్షన్ పార్టుతో స్టన్నింగ్‌గా సాగుతుంది.
టీజర్లో కీర్తి సురేశ్ మార్కెట్లో కూరగాయలు కొంటుండగా.. పాత అంబాసిడర్ కారులో ఉన్న దొంగలునుంచి ఆమెను చూస్తారు. కారులో కీర్తిసురేశ్ దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కెళ్తారు. ఇంతకీ బ్యాగ్‌లో ఏముందోనని ఓపెన్ చేసి చూడగా.. రక్తపు మరకలతో ఉన్న కత్తితోపాటు కొంత నగదును కనిపిస్తుంది. ఇంతలోనే దొంగలున్న గోదాంకు కీర్తిసురేశ్ కూరగాయల బ్యాగ్‌తో వస్తుంది.
ఇంతకీ మీరు రా ఏజెంటా అని కీర్తిసురేశ్‌ను దొంగలు అడిగితే.. కాదు అని చెప్తుంది. మధ్యలో కీర్తిసురేశ్ స్టైలిష్ యాక్షన్ పార్ట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇంతలోనే రాధికా శరత్‌కుమార్ (తల్లి) కీర్తిసురేశ్‌కు ఫోన్ చేసి కూరగాయలతో త్వరగా రమ్మని చెప్తుంది. ఇంతకీ కీర్తిసురేశ్ రివాల్వర్ రీటాగా మారడానికి కారణమేమై ఉంటుంది.. రివాల్వర్ రీటా ఏదైనా మిషన్‌లో పాల్గొంటుందా.. ? అనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో రాధిక, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రివాల్వర్ రీటా టీజర్..
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్