Bhool Bhulaiyaa 3 | బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న హార్రర్ కామెడీ ప్రాంఛైజీ భూల్ భూలైయా (Bhool Bhulaiyaa ). కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ ‘భూల్ భూలైయా-2’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక మరోసారి భయపెడుతూ కామెడీ పండించేందుకు వచ్చేస్తుంది భూల్ భూలైయా-3 (Bhool Bhulaiyaa 3). కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్.
రెండు పార్టులను మించి త్రీక్వెల్ ఉండబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ అనీశ్ బజ్మీ. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ తమ పర్ఫార్మెన్స్తో అదరగొట్టడం ఖాయమని టీజర్ చెప్పకనే చెబుతోంది. 2007లో ప్రియదర్శన్ డైరెక్షన్లో అక్షయ్‌కుమార్, విద్యాబాలన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కింది భూల్ భూలైయా. ఫస్ట్ పార్టు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సీక్వెల్ కూడా అదే ట్రెండ్ క్రియేట్ చేసింది.
మరి మూడో పార్టు ఎలా ఇంప్రెస్ చేయబోతుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. సీక్వెల్ తెరకెక్కించిన అనీశ్ బజ్మీ మూడో పార్టును కూడా డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Kya Laga Kahaani Khatam Ho Gayi !!
Rooh Baba vs Manjulika..iss Diwali🔥
Teaser Out Now !!The horror epic adventure begins this Diwali 🔥 #BhoolBhulaiyaa3 🤙🏻👻#YeDiwaliBhoolBhulaiyaaVaalihttps://t.co/UJZZZMnng5 @BazmeeAnees @vidya_balan @tripti_dimri23 #BhushanKumar… pic.twitter.com/TmgowGVdWX
— Kartik Aaryan (@TheAaryanKartik) September 27, 2024
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్