పీఎస్ మిత్రన్ (PS Mithran), కార్తీ (Karthi) కాంబినేషన్లో వచ్చిన చిత్రం సర్దార్ (Sardar). స్పై థ్రిల్లర్‌గా జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కలెక్షన్ల పంట పండిస్తోంది. కాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రెండో వారంలో కూడా సక్సెస్ ఫుల్ స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
ప్రస్తుతం సర్దార్ థియేటర్ల సంఖ్య 380 నుంచి 500 (సుమారు)కు పెంచినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్, ప్రమోషన్స్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడటంలో కీలక పాత్ర పోషించినట్టు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, రజిష్ విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. సీనియర్ నటి లైలా కీ రోల్ పోషించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేశారు.
డైరెక్టర్ పీఎస్ మిత్రన్ టీం ఇప్పటికే సర్దార్ 2 చిత్రంపై అధికారిక అప్డేట్ కూడా ఇచ్చేసింది. ఒకసారి స్పై అయితే, ఎప్పుడూ స్పై.. మిషన్ కంబోడియా త్వరలో మొదలవుతుంది.. అంటూ మేకర్స్ సర్దార్ 2 అనౌన్స్ మెంట్ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Makkale storming into the 2nd week with bigger screens 🔥🔥🔥 #Sardar #SardarBlockbuster pic.twitter.com/97VptfbE0d
— PS Mithran (@Psmithran) October 27, 2022
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో
Read Also : Black and white Teaser | హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ టీజర్
Read Also : Jyotika | 13 ఏండ్ల తర్వాత రీఎంట్రీ.. సెట్స్‌లో జ్యోతిక వీడియో వైరల్