Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో
నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవలే అడ్వర్టైజింగ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్ వీడియో వచ్చేసింది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు అనిల్ రావిపూడి సినిమాను కూడా లైన్లో పెట్టాడు.
కాగా ఈ స్టార్ హీరో ఇటీవలే అడ్వర్టైజింగ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్ వీడియో వచ్చేసింది. లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయిప్రియ గ్రూప్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు బాలకృష్ణ. ఈ టాలెంటెడ్ హీరో సినిమాటిక్ స్టైల్లో 116 పారామౌంట్ వెంచర్ ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే ఆహా టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 1, అన్‌స్టాపబుల్ సీజన్ 2లతో అభిమానులకు వినోదాన్ని పంచుతూ ఓటీటీ ప్రపంచంలో తన మార్కును క్రియేట్ చేస్తున్న బాలకృష్ణ .. కమర్షియల్ టచ్ ఇస్తూ తొలిసారి యాడ్‌లో కూడా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ ఎంతోమంది పేదలకు సేవలందిస్తున్నారని తెలిసిందే. ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ను బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. నందమూరి హీరో ఆలోచనకు, గొప్ప మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు. వీరసింహా రెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
బాలకృష్ణ యాడ్‌పై ఓ లుక్కేయండి మరి..
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

