Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న హరీష్ కల్యాణ్‌కి సంబంధించిన తాజా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. హరీశ్ కల్యాణ్‌కు నేడు చాలా ముఖ్యమైన రోజు. తాజా అప్డేట్ ప్రకారం ఇవాళ పెళ్లిపీటలెక్కబోతున్నాడు.
న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ పోషించిన జెర్సీ చిత్రంలో కీలక పాత్రలో నటించి.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు హరీష్ కల్యాణ్. పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ యువ నటుడికి సంబంధించిన తాజా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. హరీష్ కల్యాణ్‌కు నేడు చాలా ముఖ్యమైన రోజు. తాజా అప్డేట్ ప్రకారం ఇవాళ పెళ్లిపీటలెక్కబోతున్నాడు హరీష్ కల్యాణ్.
హరీశ్ కల్యాణ్ అక్టోబర్ 6న తన ఫియాన్సీ నర్మద ఉదయకుమార్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. నిశ్చితార్థం విషయాన్ని షేర్ చేసుకున్నాడు. కాగా హరీష్ కల్యాణ్ పెళ్లి తేదీ, టైం, వేదిక విషయాలను అతడి తండ్రి, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కల్యాణ్ తాజాగా మీడియాతో పంచుకున్నారు. ఇవాళ ఉదయం 9 నుంచి 10:30 గంటల మధ్య హరీష్ కల్యాణ్-నర్మద వివాహం జరుగనుందని కల్యాణ్ తెలిపారు. చెన్నైలోని తిరువెర్కడు జీపీఎన్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరుగుతుందని, ప్రతీ ఒక్కరూ పెళ్లికి హాజరై హరీష్ కల్యాణ్-నర్మద దంపతులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న హరీష్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్, ఫాలోవర్లు. కాగా తమది ప్రేమవివాహమంటూ వచ్చిన వార్తలపై హరీష్ కల్యాణ్ క్లారిటీ ఇస్తూ..నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా ఫియాన్సీ పేరు నర్మద ఉదయకుమార్. మా రెండు కుటుంబాల సమక్షంలో ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెళ్లితో ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. నర్మదలాంటి భాగస్వామి నాకు దొరకడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ప్రీ వెడ్డింగ్ ప్రెస్ మీట్లో హరీష్ కల్యాణ్.. వీడియో
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

