కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ లాంఛ్ చేశారు.
నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రెస్ట్రిక్షన్స్ అని హెబ్బా వాయిస్ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్ తో షురూ అయింది టీజర్. సిగరెట్ తాగుతున్న హెబ్బా పటేల్ తన చేతి వేలుకి రక్తం చూసి షాకవుతుంది. ఆ తర్వాత మీ స్వేచ్చను వేడుక చేసుకోండి..అంటోంది. టీజర్ మధ్యలో రెండు షేడ్స్ ఉన్న లుక్‌లో కనిపిస్తోంది హెబ్బా పటేల్.
హీరోహీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మధ్య ఏదో సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్నట్టు హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఇంతకీ హీరోహీరోయిన్ల మధ్య ఏం జరిగింది..? అనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ సాగుతున్న టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉండి.. ఆసక్తిని పెంచుతోంది. మేఘనా రెడ్డి సమర్పణలో ఎస్ఆర్ ఆర్ట్స్/ఏయూ, ఐ స్టూడియోస్ సంయుక్త భాగస్వామ్యంలో పద్మనాభరెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించి.. అందరినీ మెప్పించింది హెబ్బాపటేల్. మొదట గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఈ భామ నటనకు ఆస్కారమున్న కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తుంది.
#VijayendraPrasadV Garu Launched the riveting teaser of @IamHebahPatel ‘s B&W #blackandwhitehttps://t.co/7aqxMToba1
@suryashriniwaas @laharishari @neni_naveen #SuryaPrakash #MeghanaReddy #SandeepReddy @Padmana77597354 #SurendraReddy #AjayArasada
@adityamusic @PROSaiSatish pic.twitter.com/n1YUPCEAcw— BA Raju's Team (@baraju_SuperHit) October 28, 2022
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో