ఠాగూర్, మాస్, షాక్, విక్రమార్కుడు సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది బాంబే భామ జ్యోతిక (Jyotika). స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత కోలీవుడ్‌లో సెటిలైపోయింది. ఈ నటి ప్రస్తుతం మలయాళంలో కొత్త సినిమా కాథళ్లో నటిస్తోంది. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టి (Mammootty) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
Kaathal: The Core టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా.. జ్యోతిక కూడా గురువారం సెట్స్ లో జాయిన్ అయింది. ఈ షెడ్యూల్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లొకేషన్లో మమ్ముట్టి, జ్యోతిక ప్రత్యక్షమైన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సూర్య ఫ్యాన్స్ క్లబ్ మెంబర్స్ సినిమా లొకేషన్ ఫొటోలను ట్విటర్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జోయ్ బేబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఆదర్శ్ సుకుమారన్-పౌల్సన్ స్కారియా కథనందిస్తున్నారు. మమ్ముట్టి కంపనీ-వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మాథ్యూస్ పులిక్కన్ మ్యూజిక్ డైరెక్టర్. జ్యోతిక 13 ఏండ్ల తర్వాత ఈ సినిమాతో మాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మమ్ముట్టి టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తోన్న ఏజెంట్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మమ్ముట్టి లుక్కు మంచి స్పందన వస్తోంది.
లొకేషన్లో జ్యోతిక, మమ్ముట్టి వీడియో..
#Jyothika #Mammukka #Kaathal 😻🤍 pic.twitter.com/T3DGzfp55a
— Mollywood Exclusive (@Mollywoodfilms) October 27, 2022
#Jyothika Join the set of #Kaathal the core in Kerala today… ❤️🥰🥰#KaathaltheCore #Mammootty #Jyotika #Jeobaby pic.twitter.com/HBeSVoqSnv
— Jyothika Fans Club (@Jyothika_offi) October 27, 2022
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో