కమల్ హాసన్ (Kamal Haasan) కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం భారతీయుడు. ఈ ఆల్‌టైమ్ ఫేవరేట్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ ఇండియన్ 2 (Indian 2) వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇండియన్ 2 షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ రాత్రి, పగలు తీవ్రంగా కష్టపడుతుందని ఇప్పటికే కమల్ హాసన్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో చెప్పాడు.
తాజాగా మూవీ లవర్స్ కోసం స్టిల్ రూపంలో ఓ ఎక్జయిటింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్లో స్టంట్ కమ్ యాక్షన్ డిజైన్ టీంతో కమల్ హాసన్ చర్చిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం ఇండియన్ 2 కల్పాక్కమ్ సద్రాస్ డచ్ పోర్టులో కొనసాగుతుంది. మొత్తానికి త్వరలోనే ఇండియన్ 2 చిత్రీకరణను ముగించనున్నట్టు తాజా ఫొటోతో అర్థమవుతుంది. శంకర్ ఇందులో ఎలాంటి సీక్వెన్స్ పెట్టబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కమల్ హాసన్ ఇండియన్ 2 సెట్స్ పై ఉండగానే మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో 234వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇండియన్ 2 లొకేషన్లో కమల్ హాసన్..
#Ulaganayagan @ikamalhaasan with #Indian2 Action design team..#BulletActionDesign pic.twitter.com/pQScPagTuQ
— Ramesh Bala (@rameshlaus) March 9, 2023
Read Also :
RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
Varun Sandesh | ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
KA9 | స్పీడు మీదున్న కిరణ్ అబ్బవరం.. కొత్త సినిమా లాంఛ్
Sabdham | ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్డేట్