ఎవరూ ఊహించని ఏదో ఒక కామెంట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కేఏ పాల్ (KA Paul). కొన్ని సార్లు ఈయన చేసే కామెంట్స్ వివాదాలు కూడా సృష్టిస్తుంటాయి. పాలిటిక్స్ లోకి కూడా ఎంటరైన కేఏ పాల్ వీలు దొరికినపుడల్లా టీవీ చర్చల్లో పాల్గొంటుంటారు. తాజాగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో తన ఫాలోవర్లతో లైవ్ సెషన్లో పాల్గొన్నారు కేఏ పాల్. ఒకవేళ మీరు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చూస్తే..అని ఓ వ్యక్తి కేఏ పాల్‌ను అడిగాడు.
దీనిపై కేఏ పాల్ స్పందిస్తూ..ప్రతీ రోజు ఓ కొత్త సినిమా వస్తుంది. అవన్నింటినీ ఎవరు గుర్తుంచుకుంటారు. ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడూ వినలేదు. అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు మీకు వేరే పనులేమి లేవా..? అని యువతను ప్రశ్నించాడు. మీరు విడుదలైన ప్రతీ సినిమాను చూస్తారా..? అని ప్రశ్నించాడు. ప్రతీ ఒక్కరూ సమాజంలో మార్పు కోసం పనిచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఉపయోగపడే పని చేయాలి..నిర్మాణాత్మకంగా ఉండాలి.
ఈ సారి చాలా ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసేందుకు కష్టపడి పనిచేస్తాం. కులవివక్షను రూపు మాపే దిశగా పయనిస్తాం అని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మీద ప్రశ్నలు వేయడంపై క్లాస్ పీకారు కేఏ పాల్. ఎవరైనా సినిమా తీస్తే..మీరు దాన్ని చూస్తారు. ఇది పూర్తిగా టైం వృథా. మీరు ఆ సినిమా నుంచి ఎలాంటి మంచి విషయాన్ని పొందలేరు. కనీసం అర్థవంతమైన సినిమాలు చూడండి. నేనెప్పుడూ ఆర్ఆర్ఆర్ గురించి వినలేదు. అసలు అదేంటో నాకు తెలియదు.అంటూ సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.
Nee Moham raa ! pic.twitter.com/KGrAzqwuXG
— Ram Gopal Varma (@RGVzoomin) March 31, 2022
కేఎ పాల్ లైవ్ సెషన్ వీడియోను ట్యాగ్ చేస్తూ…నీ మొహం రా అంటూ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ (RGV) రీట్వీట్ చేయడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.