స్టార్ హీరోయిన్ సమంత (Samantha)..అద్బుతమైన యాక్టింగ్‌తోనే కాదు..సమయాన్ని వట్టి తనలోని గ్లామరస్ యాంగిల్‌ను బయటపెడుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌మీడియాలో సామ్‌కు ఉండే ఫాలోవర్లు కానీ, ఆమెకుండే క్రేజ్ కానీ చాలా స్పెషల్. ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్‌తో నెట్టింట పోస్టులు పెడుతూ తన ఫాలోవర్లలో జోష్ నింపుతుంది. తాజాగా ఈ చెన్నై సోయగం హాట్ హాట్ పోజుతో దర్శనమిస్తోంది. సమంత ఇన్ స్టాగ్రామ్‌లో కొత్త కవర్ ఫొటో (Samantha new cover photo)ను అందరితో పంచుకుంది.
స్కిన్నీ అవుట్ ఫిట్‌లో అందాన్ని ఆరబోస్తూ..మత్తెక్కించే చూపుతో కుర్రకారు మనసు దోచేస్తుంది. సమంత సరికొత్త దర్శనమిస్తున్న న్యూ కవర్ ఫొటో ఇపుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్న కాతువాకుల రెండు కాధల్ (Kaathu Vaakula Rendu Kadhal) సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా కంప్లీట్ చేసిన సందర్భంగా సెట్స్ లో కేక్ కట్ చేసి..దిగిన ఫొటోలు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.
మరోవైపు హరి శంకర్-హరీష్ డైరెక్షన్ లో ఫీ మేల్ ఓరియెంటెడ్ చిత్రం యశోద (Yashoda) లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే గుణశేఖర్ డైరెక్షన్లో చేస్తున్నశాకుంతలం షూటింగ్ పూర్తి చేసింది. హాలీవుడ్ డైరెక్టర్ జాన్ పిలిప్ తో కలిసి ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సినిమా చేస్తోంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్‌తో సిటడెల్ వెబ్‌సిరీస్ చేస్తోంది.