UPI payments | యూపీఐ చార్జీల భారం వ్యాపారులదే.. వినియోగదారులకు కేంద్రం హామీ ఇస్తుందా
UPI payments : యూపీఐ ఎండీఆర్ చార్జీల విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులు.. వినియోగదారులపై పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది.
UPI payments : యూపీఐ ఎండీఆర్ చార్జీల విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, పలు వ్యాపార వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాపారులు.. ఈ ఛార్జీల భారాన్ని పరోక్షంగా వినియోగదారులపై మోపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే, రూ.2,000 బిల్లుపై చెల్లించాల్సిన బిల్లులకు అనుగుణంగా వ్యాపారులు ధరలు సవరించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వవర్గాలు స్పందించాయి. 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులు.. వినియోగదారులపై పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అలా వినియోగదారులపై పడకుండా చూస్తామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో చట్టం అమలుపై ఉన్న లోపాలపై దృష్టి పెడుతున్నాం. పేమెంట్లు చేసే సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. వ్యాపారులు ఈ చార్జీలను వినియోగదారులపై పడకుండా చూసే తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతున్నాం. అలాగే, స్టాక్ మార్కెట్లో కూడా 0.02 శాతం చార్జీలను వసూలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లు వంటి సంస్థలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. రూ.2,000 దాటిని యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలను కేంద్రం అక్టోబర్ 15 నుంచి వసూలు చేయబోతుంది. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ.300 ఎండీఆర్ ఛార్జీ వసూలు చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై కూడా ఛార్జీలు వసూలు చేయనున్న నేపథ్యంలో ఇక్కడ కూడా గరిష్టంగా రూ.300 వరకు వసూలు చేస్తారు. చిరు వ్యాపారులు, రోజువారీ వ్యాపారులపై ఈ ఛార్జీల భారం పడబోదని కేంద్రం చెబుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- MDR Charges
- merchants
- sebi
- upi
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

