Erravelli Farmer| తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం లోపల అసైన్డ్ భూములు ఉన్నాయని డ్రామాలకు తెరలేపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కిలోమీటర్ దూరంలో సర్వే చేయించేందుకు రెవెన్యూ అధికారులను పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులను అడ్డుకున్న స్థానిక రైతులు వారిపై ప్రశ్నలు సంధించారు.
ఓ రైతు మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూముల్లో మా తాత ముత్తాతల నుంచే ఉన్నరు. ఇయ్యాళ్ల వచ్చి మా భూములను వేరేవాళ్లకు పంచుతా అంటే ఎట్లా రానిస్తమని అన్నాడు. మేం బతకలేకపోతున్నం.. ఒక ఊరోళ్లను మా ఊరికి రానివ్వాలంటే వాళ్లను ఇక్కడికెట్లా రానిస్తం. సారేమన్నా గుంటెడె భూమి తీసుకుంటే ఆయనను ఏమైనా అనొచ్చు. సార్ ఏం తీసుకోకుండా మా భూములను మంచిగ చేసిండు.. ఈ భూములకు, కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫాంహౌస్ ఉందనే మాటలన్నీ పుట్టించినవే.. కేసీఆర్ మాకెప్పుడూ కూడా ధోకా చేయలేదు.. ఏం కూడా గుంజుకుంటా అనలేదు.. రేవంత్ రెడ్డి వచ్చి గుంజుకుంటా అంటే మేమెట్లా బతకాలి.. ఇక్కడికి ఎట్లా రానిస్తం.. ఒక్క కుటుంబంలోనే ఇద్దరు, ముగ్గురు, నలుగురు పిల్లలున్నరు.. ఒక ఎకరంలోనే వీళ్లంతా ఎట్లా బతుకుతరు.. ఈయనొచ్చి గుంజుకుంటా అంటే మేమెక్కడికి పోవాలే.. అని ఫైర్ అయ్యాడు.
మా దళిత భూములు గుంజుకుని వేరే దళితులకు ఇస్తానంటే మేం విషం పోసుకొని చావాలా..? అని రేవంత్‌ను మరో రైతు ప్రశ్నించారు. మా తాతల కాలం నుండి ఈ భూములు మేమే చేస్తున్నాం. ఈ భూముల్లో సాగు చేస్తూ 300 దళిత కుటుంబాలు బతుకుతున్నారు. ఈ భూముల్లో గుట్టలు ఉండేవి.. కేసీఆర్ మా ఊరును దత్తత తీసుకున్నాక భూములను చదును చేసి, డ్యాం కట్టాడు.. ముందు ఒక్క చుక్క నీరు లేకుండేది.. ఇప్పుడు వరి పొలాలు పెట్టుకొని సాగు చేస్తున్నాం
కేసీఆర్ వేరే వారు అమ్మిన భూములనే కొన్నాడు కానీ ఇంచు కూడా కబ్జా చేయలేదన్నాడు. మా భూములు మేమే చేస్తున్నాం.. మా భూములు వేరే వాళ్లకి ఇస్తామంటే మేమేం కావాలి..? మా కుటుంబాలు ఏం కావాలి..? అని రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించాడు.
మా భూముల జోలికొస్తే మేము దేనికంటే దానికే సిద్ధం
మా భూములకు, కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు
కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది అనేది కూడా అబద్ధం.. అవన్నీ పుట్టించిన మాటలే
– ఎర్రవెల్లిలో దళిత రైతులు https://t.co/7Z0Tp9Qxf0 pic.twitter.com/9bjpJuMRGW
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
మా దళిత భూములు గుంజుకుని వేరే దళితులకు ఇస్తానంటే మేం విషం పోసుకొని చావాలా?
మా తాతల కాలం నుండి ఈ భూములు మేమే చేస్తున్నాం
ఈ భూముల్లో సాగు చేస్తూ 300 దళిత కుటుంబాలు బతుకుతున్నారు
ఈ భూముల్లో గుట్టలు ఉండేవి.. కేసీఆర్ మా ఊరును దత్తత తీసుకున్నాక భూములను చదును చేసి, డ్యాం కట్టాడు… https://t.co/SiNN5iCIrN pic.twitter.com/sd3MoC5J8e
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026