ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేవెళ్ల సబ్ ట్రెజరరీ అధికారులు
ACB Raids | జిల్లాలోని చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరరీ కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు .
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరరీ కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు ( Sub-Treasury Officers) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ( ACB Raids ) . సస్పెన్షన్ కాలపు జీతం బిల్లులను , పదవీ విరమణానంతర పెన్షన్ సర్దుబాటు బకాయిల మొత్తాన్ని ప్రాసెస్ చేసి, ఫార్వార్డ్ చేసేందుకు ప్రతిఫలంగా ఫిర్యాదుదారుడి నుంచి సబ్ ట్రెజరరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరరీ అధికారి కావలి అనురాధ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు.
వీటిలో మొదటి విడతగా లక్ష రూపాయలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వీరికి మధ్యవర్తిగా ఉన్న వడ్డె జంగయ్య అనే వ్యక్తికి లక్ష రూపాయలు అందించగా వీటిలో రూ.50 వేలు అధికారులు, మిగతా రూ.50 వేలు మధ్యవర్తి లంచంగా తీసుకున్నారు. ముగ్గురు వద్ద నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి నాంపల్లి జుడీషియల్ కోర్టులో హాజరు పరిచినామని ఏసీబీ అధికారులు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- chevella
- Ranga Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

