ICC | వరల్డ్‌కప్ ముందర వరం.. జింబాబ్వే క్రికెట్ చైర్మన్‌కు కీలక పదవి..!
ICC : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న దేశాల్లో ఒకటైన జింబాబ్వే (Zimbabwe)కు తీపికబురు. ఆ దేశ క్రికెట్ అధ్యక్షుడు తవేంగ్వా ముకుహ్లానీ (Tavengwa Mukuhlani) అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)లో కీలక పదవి చేపట్టాడు.
ICC : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న దేశాల్లో ఒకటైన జింబాబ్వే (Zimbabwe)కు తీపికబురు. ఆ దేశ క్రికెట్ అధ్యక్షుడు తవేంగ్వా ముకుహ్లానీ (Tavengwa Mukuhlani) అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)లో కీలక పదవి చేపట్టాడు. క్రికెట్ వ్యవహారాలపై సుదీర్ఘ అనుభమున్న అతడు ఐసీసీ డిప్యూటీ చైర్ పర్సన్‌గా నియమితులయ్యాడు. ప్రపంచకప్ ముందర అతడికి ఈ పదవి దక్కడం పట్ల జింబాబ్వే క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తవేంగ్వా ముకుహ్లానీ నియమితులయ్యాడు. బోర్డు నుంచి వైదొలిగిన ఇమ్రాన్ ఖవాజా స్థానంలో ముకుహ్లానీ ఈ పదవికి ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాలుగా అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఇమ్రాన్ పదవీ కాలం ఈ ఏడాది జూలైలో ముగిసింది. సింగపూర్ క్రికెట్ పాలకుడైన ఇమ్రాన్ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయాడు. దాంతో, ఐసీసీ డిప్యూటీ చైర్పర్సన్ పదవి నుంచి ఇమ్రాన్ వారం క్రితమే వైదొలిగాడు. సో.. అతడి స్థానంలో జింబాబ్బే క్రికెట్ చైర్మన్ ముకుహ్లాని ఎంపికయ్యాడని గురువారం ఐసీసీ వెల్లడించింది.
Tavengwa Mukuhlani from Zimbabwe has been confirmed as the Deputy Chair of the ICC.https://t.co/1DLmCA2xTl
— ICC (@ICC) September 17, 2026
‘జింబాబ్వే క్రికెట్లో అనుభవంతో, ఆ ప్రాంతంపై ఉన్న అవగాహనతో ఐసీసీ డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి ముకుహ్లాని మరింత విలువ చేకూరుస్తాడు. 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాలో జరుగనున్న వరల్డ్‌కప్ టోర్నీని విజయవంతం చేయడం కోసం సంయుక్త దేశాలు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలో క్రికెట్ బలోపేతానికి, ఆ ఖండంలో ఈ ఆట వ్యాప్తికి ఈ మెగా
టోర్నీ కీలకం కానుంది’ అని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ జరుగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు ఈ మెగా ఈవెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

