‘పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేయాలి’
రైతులు పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేసుకోవాలని చండూరు ఏవో పి.మల్లేష్ అన్నారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధి కుమ్మందానిగూడెం గ్రామంలో గురువారం పత్తి పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు, పప్పు ధాన్యాలపైన వాటి ఉపయోగం గురించి ఆత్మ సౌజన్యంలో...
చండూరు, సెప్టెంబర్ 17 : రైతులు పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేసుకోవాలని చండూరు ఏవో పి.మల్లేష్ అన్నారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధి కుమ్మందానిగూడెం గ్రామంలో గురువారం పత్తి పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు, పప్పు ధాన్యాలపైన వాటి ఉపయోగం గురించి ఆత్మ సౌజన్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. పత్తి పంట విత్తనం వేసుకునే మొదలు పత్తి తీసే వరకు రైతులు చేపట్టాల్సిన సాగు పద్ధతులను వివరించారు. ప్రధానంగా పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున ఎకరానికి ఫిప్రోనిల్ 400 gram లు+13.0.45 kg + అగ్రోమిన్ మాక్స కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పత్తిలో అంతర్ పంటలుగా కంది, దోస ఇతర కూరగాయలు వేసుకోవాలని సూచించారు. రైతు సోదరులు ఎరువులు, పురుగు మందులు తక్కువ మోతాదులో వాడాలని, సేంద్రీయ ఎరువుల వినియోగం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ శంకర్, ఉప సర్పంచ్ సరికొండ ముత్యాలు, ఏఈఓ పి.పవన్, బీటీఎం మునుగోడు రమేష్, రైతులు వర్కాల శ్రవణ్, కట్కూరి యాదయ్య, వర్కాల శంకరయ్య, ఎండీ సత్తార్, తోటకూరి రాములు, కడారీ లింగయ్య, గాలి దాసు, కట్కూరి సందీప్, ఎండీ షరీఫ్, గాలి జగన్, గాలి మహేష్, దోటి మధు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

