పెన్‌పహాడ్, సెప్టెంబర్ 17 : కేసీఆర్‌తోనే తండాలు అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ పెన్‌పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్, సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్న సీతారాం, చిన్న గరాయ కుంట తండా, గుడెపు కుంట తండా. న్యూ బంజారాహిల్స్ తండాల్లో గిరిజనులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి చిత్ర పాటలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలతో మభ్యపెట్టి గదినెక్కి మొండిచేయి చూపడంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం హామీలకు పరిమితమయ్యారని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 6 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతం చేశారని, బంజారా భవన్ కట్టించారని, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, విదేశీ విద్యకు సహాయం చేశారని, గురుకులాలు పెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ పనులు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో చావు దెబ్బ తినక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దారవత్ భిక్షం నాయక్, భూక్య రవీందర్, లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.