Food Poison | ఫుడ్ పాయిజన్తో 26 మంది విద్యార్థులకు అస్వస్థత
Food Poison | సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 26 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు.
మునిపల్లి : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ( Food Poisoning ) తో 26 మంది విద్యార్థులు అస్వస్థత ( Fell Ill ) కు గురయ్యారు. వీరిని సదాశివపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని మునిపల్లి ఎంఈవో భీమ్ సింగ్ ( MEO Bheem Singh) తెలిపారు.

ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్బంగా బుధవారం రాత్రి ఉపాధ్యాయు డి ఇంటి వద్ద వండిన చికెన్ బిర్యానిని గురువారం పాఠశాలకు తీసుకు వచ్చి విద్యార్థులకు పెట్టాడు. తిన్న వెంటనే విద్యార్థులు అస్వస్థతకు గురికాగా హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు అనుమతితో విద్యార్థులకు భోజనం పెట్టారని నిలదీశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

